ఆదోని కోట రణమండల యాత్ర
శ్రావణమాసంలో స్వామికి కొండపైన పూజలు
రాణమండల వైభవం ప్రత్యేక విశిష్టత కలిగివుండును.
ఆదోని కోటలో కొండాపైన వెలసిన ఆంజనేయ స్వామి దర్శనార్థం వెళ్లినవారికి ఎంతో శుభ లాభందాయకం.
అక్కడకడ సుందరమైన నీటిమడుగులు అందులోని తామర పూలు ప్రయాణశక్తిని రెకేత్తించును.
600 వందలు మెట్లు కలిగిన కొండ ఆంజనేయుడు
ఆంజనేయ స్వామి కళ్లారా కనుట ఆనందదాయకం ఎంతో పుణ్యము ఉంటే గాని దర్శనభాగ్యం లభించుట జరుగదు.
ఆదోని పట్టణంలో ఇలాంటి దివ్య తేజమైన
విగ్రహరూపం వేలసిఉండుట, శ్రావణ మాసంలో అందరుకలసి గుంపులుగా కొండపైకి చేరి, ఆహ్లాదమైన వాతావర్ణంలో ప్రకృతి సౌందర్యం నడుమ మారుతి ప్రత్యేక పూజలతో కొనాయడు బడుతున్న స్వామికి వందనాములతో వేడుకొను భక్తులకు స్వామి ఆశిస్సులు అందించు.
అతడే రామభంటు, రాముని వరములు పొందినవాడు వీరాంజనేయుడు.
కోటా వీరభద్ర సామి గుడిమొదలు కాలినడకన ప్రయాణం కొనసాగించగా రాంజల ప్రాంతంతో మొదలుగొని నవాబ్ శితల కోటాలోనుండి ఎగువకు వెళుతున్నత ఆహ్లాదం కలిగించును. మిత్రులతో వెళ్లినా, పిల్లలతో వెళ్లినా, కుటంబముతో పోయిన ఎంతో ఉల్లాసము కలిగి కొండనేక్కు కష్టం కానరాదు.
మార్గమద్యమున హనుమ రూప జంతువులు అనగా కోతి మూకలు కానవచ్చును. అది దేవ హనుమ జాడకు సూచకం.
అక్కడ ఆంజనేయ దండకం స్తోత్రించిన, నామజపం ఉత్తరంచిన భయము తొలగి జయముకలుగు.
ఆదోని ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ప్రముఖ పారిశ్రామిక పట్టణముగా పేరొందినది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, ఉరుకుంద ఈరన్న స్వామి అతి దగ్గరలో ఉన్న ప్రసిద్ధ దేవస్థానములు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి